Posts

నా పెళ్లి

Image
ఇవాళ నాకు విశ్వనాథ సూర్యనారాయణ తో పరమ సంప్రదాయ బద్ధంగా పెళ్లి జరిగిన రోజు. . [ జూన్ 14 ] పెళ్లి అంటే బొత్తిగా ఒక ఊహ , స్పష్టంగా లేని , 17 సంవత్సరాల వయసులో జరిగిన పెళ్లి నాది . ఇంటర్ వరకూ చదివిన చదువు . ఇల్లు కాక మరో లోకం తెలియని టీనేజ్ పిల్లల్లోని అమాయకత్వం . 1975 వ సంవత్సరంలో నేను ఉన్న స్థితి . పెళ్లి కార్డు మీద , సూర్యనారాయణ -- బెర్ట్రెండ్ రస్సెల్ గారిది -- ఒక కొటేషన్ వేయించి పెళ్లి కార్డుని అచ్చువేయించుకున్నాడు తన ముచ్చట కోసం . నాకు ఆయన అంటే ఆ బెర్ట్రెండ్ రస్సెల్ గారు ఎవరో కూడా తెలీదు . అప్పట్లో నాకు తెలుగు కాక మరో భాష రాదు . నేను చదివింది మొత్తం తెలుగు మీడియం లో ! చిన్నతనాన క్రిస్టియన్ మిషినరీ స్కూల్ , తరవాత జిల్లా పరిషత్ హైస్కూల్ ఆ తరవాత ఆ అన్నవరం సత్యదేవి ఉమెన్స్ కాలేజీ . తలదించుకునిస్కూల్ నించి ఇంటికి - ఇంటి నించీ స్కూల్ కీ ! కాలేజీ అయినా నా రొటీన్ ఇదే ! పెళ్లి , ఆ కాలంలో మా ఇళ్లల్లో అలాగే జరిగేది . పై చదువులు చదువుకోవడం అన్నది అసాధ్యం . చదివించేవాళ్లూ లేరు . చదువుకో అని సూచించిన వారూ లేరు . కానీ జ్ఞానం అన్నది ఒక దాహం . అది గనక మీలో పుట్టిందా మీరు ఆ దాహాన్ని మరి ఆపుకోలేరు . అలా ...

జ్యోతిలక్ష్మి

Image
నాకు తెలుగు సినిమా పరిజ్ఞానం తక్కువ . ఒకటి ఆసక్తి లేదు . చిన్నతనంలో  మా పెద్దవాళ్ళు మమ్మల్ని సినిమాలకి పంపేవారు కాదు . నా అంతటి  దాన్ని నేను అయిన తరవాత కూడా   నాకు దానిమీదికి మనసు పోనందువలన..  నేను  తెలుగు సినిమాలని  చాలా ఏమీ చూడలేదు .  అదీకాక  ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి సినిమాని చూసే అవకాశం నాకు బాగా దొరికింది . పూనాపిల్మ్ ఇనిస్టిట్యూట్లో నేను 94 లో ఫిల్మ్ అప్రిషియేషన్ కోర్స్ చేశాను . అంతకుముందు అమెరికాలో ఉన్నప్పుడూ రకరకాల మంచి సినిమాలని చూశాను . ఆ తరవాత ఇక్కడా  అంతర్జాతీయ సినిమాని బాగానే చూశాను . అందువలన ఒక మాధ్యమంగా సినిమాతో నాకు మంచి పరిచయమే ఉంది . తెలుగులో నేను పాత సినిమాలలో ఉన్న మంచిపాటలని విన్నాను . వాటి చిత్రీకరణ చూడలేదు . ఎందుకంటే వాటిమీద నాకున్న ఒక సరదా ఏమన్నా  ఆ నటీనటుల ముఖాలని  వాళ్ళ డాన్స్  లని  చూస్తేగనక   ఎక్కడ జారిపోతుందో ఏమో అన్న ఒక భయం వల్ల !  నాకు పాత సినిమా పాటలలో  కొన్ని  నచ్చితే  అందుకు ప్రధాన కారణం వాటిలో ఉండే సాహిత్యం వల్ల .  నేను పాటల్ని విన్నదాన్నే  కాన...

శ్రీ కందాళ సుబ్రహ్మణ్య తిలక్ స్మృతి

Image
              నేను 1986 లో నా కవితా సంకలనం " యుద్ధోన్ముఖంగా " పుస్తకపరిచయ సభ పెట్టేను . చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ లో ! ఆరోజున  ఆ  పుస్తకం విడుదల ని  కందాళ  తిలక్ గారు చేయాల్సి ఉంది .  అందువలన మీరు ఆ పత్రాన్ని కలిగి ఉన్నవారైతే ,  గమనిస్తే గనక దాన్ని  ,  ఆ ఆహ్వానపత్రం లో కూడా తిలక్ గారి పేరే ఉంటుంది . పుస్తక ఆవిష్కర్త  శ్రీ కేఎస్ తిలక్ అని . సభాధ్యక్షత కాళోజీ వహించవలసి ఉంది . చేకూరి రామారావు తదితరులు వక్తలూనూ !                ఒకసారి నేను ఆడియెన్స్ వేపు చూశాను .    ఒక పెద్దాయన  పంచె కట్టుతో  అక్కడ కూర్చుని ఉన్నారు అందరికన్నా ముందుగా వచ్చి . నేనా  ఎనభైలో సాహిత్య రంగ ప్రవేశం చేసినా నా చదువు కారణంగానూ  --- నా మనస్తత్వం కారణం గాను ఎక్కువగా ఎవరినీ కలిసిన దాన్నిగాను  . సాహిత్యరంగానా అంతే  !  పేర్ల ద్వారా కవులు - కథకులూ  పరిచయం ఉన్నా  -- ఎవరివీ ముఖపరిచయాలు నాకు ఆనాడు ఈనాడు కూడా  అంతగాలేవు  .  పైగా ...